తన పేరులో మార్పు చేసిన మెగా మేనల్లుడు
- ఇవాళ మహిళా దినోత్సవం
- తన పేరులో తల్లి పేరు దుర్గను చేర్చుకుంటున్నానన్న సాయిధరమ్ తేజ్
- ఇక నుంచి తన పేరు సాయి దుర్గా తేజ్ అని వివరణ
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో తాను, స్వాతి కలిసి నటించిన ఓ కాన్సెప్ట్ ఫిలిం స్పెషల్ స్క్రీనింగ్ కు సాయిధరమ్ తేజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగానే తన పేరు మార్పుపై ప్రకటన చేశారు. తండ్రి పేరు ఎలాగూ ఇంటి పేరులో వచ్చేస్తుందని, తల్లి పేరు కూడా తన పేరులో ఉండాలన్న ఉద్దేశంతో 'దుర్గ' అనే పేరును చేర్చుకుంటున్నానని వివరించారు.