నా పేరును రాజకీయంగా వాడుకోవద్దు: మోహన్ బాబు వార్నింగ్
- తన పేరును కొందరు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారన్న మోహన్ బాబు
- స్వప్రయోజనాల కోసం తన పేరును వాడుకోవద్దని సూచన
- ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిక
తనకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నానని... శాంతి, సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉందామని కోరుకుంటున్నానని తెలిపారు. తన విన్నపాన్ని ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా లేఖను విడుదల చేశారు.