రామ్ చరణ్ 'ఆర్‌సీ16' హీరోయిన్ గా జాన్వీ
- కన్ఫామ్ చేసిన జాన్వీ తండ్రి, నిర్మాత బోనీ కపూర్
- గేమ్ చేంజర్ సినిమా తర్వాత షూటింగ్ ప్రారంభం
- ఇప్పటికే దేవర సినిమాలో నటిస్తున్న జాన్వీ కపూర్
రామ్ చరణ్ కొత్త సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించనుందని సమాచారం. ఈ విషయాన్ని జాన్వీ కపూర్ తండ్రి, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కన్ఫామ్ చేశారు. రామ్‌చరణ్‌తో జాన్వీ కపూర్ కాంబినేషన్ పై చాలారోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా 'ఆర్‌సీ16' చిత్రంలో ఈ జంట కలిసి నటించనుందని కన్పామ్ అయింది. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోనీకపూర్ చెబుతూ 'రామ్ చరణ్ తో జాన్వీ నటించనున్న చిత్రం త్వరలో ప్రారంభం కానుంది’ అని తెలిపారు. రామ్‌చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక.. అంటే ఏప్రిల్ నుంచి 'ఆర్‌సీ16' సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. కాగా, జాన్వీ కపూర్ కు తెలుగులో ఇది రెండవ సినిమా కానుంది. ఇప్పటికే ఆమె దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే!