మహేశ్ బాబు నివాసానికి వెళ్లి పెళ్లి కార్డు అందించిన దిల్ రాజు
- దిల్ రాజు సోదరుడు శిరీష్ ఇంట పెళ్లి బాజాలు
- స్వయంగా శుభలేఖలు అందిస్తున్న దిల్ రాజు
- మహేశ్ బాబు, నమ్రత దంపతులకు ఆహ్వానం
తాజాగా ఆయన తన సోదరుడు శిరీష్, ఆశిష్, కుమార్తె హన్షితతో కలిసి సూపర్ స్టార్ మహేశ్ బాబు నివాసానికి వెళ్లారు. మహేశ్ బాబు, నమ్రత దంపతులను కలిసి శుభలేఖ అందించి, పెళ్లికి రావాలని ఆహ్వానించారు.
కాగా, ఆశిష్ తన కాబోయే అర్ధాంగి అద్వైతతో కలిసి నిన్న మోహన్ బాబు నివాసానికి వెళ్లి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. పెళ్లి సమయానికి తాను 'కన్నప్ప' షూటింగ్ కోసం న్యూజిలాండ్ లో ఉంటానని భావించిన మోహన్ బాబు... కాబోయే జంటను తన నివాసానికి ఆహ్వానించి దీవెనలు అందజేశారు.