గ్రామీ 2024 మ్యూజిక్ అవార్డుల్లో మెరిసిన భారత్
- బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డులు గెలుచుకున్న జాకీర్ హుస్సేన్, శంకర్ మహదేవన్
- ఫ్యూజన్ బ్యాండ్ ‘శక్తి’కి దక్కిన అవార్డులు
- ఫ్లూట్ ప్లేయర్ రాకేష్ చౌరాసియాతో కలిసి రెండో అవార్డు దక్కించుకున్న బృందం
మూడు సార్లు గ్రామీ అవార్డు దక్కించుకున్న ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ రికీ కేజ్.. శంకర్ మహదేవన్ ప్రసంగాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవార్డు గెలుచుకున్న శక్తి బ్యాండ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ‘శక్తి’ 2024 గ్రామీ అవార్డులను గెలుచుకుందని, ఈ ఆల్బమ్ ద్వారా నలుగురు గొప్ప భారతీయ సంగీతకారులు గ్రామీ అవార్డులను గెలుచుకున్నారని రికీ కేజ్ పేర్కొన్నారు. ఫ్లూట్ ప్లేయర్ రాకేష్ చౌరాసియాతో కలిసి శంకర్ మహదేవన్, సెల్వగణేష్, గణేశ్ రాజగోపాలన్, ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ రెండో అవార్డును గెలుచుకున్నారని ప్రస్తావించారు. కాగా జాన్ మెక్‌లాఫ్లిన్, జాకీర్ హుస్సేన్, శంకర్ మహదేవన్, వీ.సెల్వగణేశ్, గణేశ్ రాజగోపాలన్‌ల సహకారంతో ‘శక్తి’ బ్యాండ్‌ను రూపొందించారు.