తండ్రి కాబోతున్న నటుడు నిఖిల్.. భార్య సీమంతం ఫొటో పోస్ట్
- తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ ‘ఎక్స్’లో ఫొటో పంచుకున్న నిఖిల్
- అభిమానుల ఆశీస్సులు కావాలన్న నటుడు
- ప్రస్తుతం ‘స్వయంభూ’ సినిమాతో బిజీ
- కెరియర్లోనే భారీ బడ్జెట్ మూవీ
హ్యాపీడేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నిఖిల్ ఒక్కో మెట్టు ఎక్కుతూ పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. అతడు కథానాయకుడిగా వచ్చిన కార్తికేయ-2 సినిమా రికార్డులు కొల్లగొట్టింది. అంతేకాదు, అతడిని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లింది. ప్రస్తుతం భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ‘స్వయంభూ’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం వియత్నాం వెళ్లి మూడు నెలలపాటు యుద్ధ విద్యలు కూడా నేర్చుకున్నాడు. నిఖిల్ కెరియర్లోనే ఇది భారీ బడ్జెట్ సినిమాగా రూపొందుతోంది.