సుధా మూర్తికి ఆటోలో ప్రపోజ్ చేసిన ఇన్ఫీ నారాయణమూర్తి
- తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్న ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు
- ఆటో డ్రైవర్‌కు కన్నడ రాకపోవడంతో తమకు కావాల్సిన ప్రైవసీ దక్కిందని వెల్లడి
- మధ్య తరగతికి చెందిన తమకు అప్పట్లో ఆటో ప్రయాణం ఓ లగ్జరీ అని వ్యాఖ్య
‘‘మాది చిన్న ప్రపంచం. మధ్యతరగతి నేపథ్యం. మాకున్న వనరులు పరిమితం. అప్పట్లో మాకు ఆటో ప్రయాణం కూడా ఓ లగ్జరీ. ఆ రోజు మేము కన్నడలో మాట్లాడుకుంటున్నాం. ఆటో డ్రైవర్‌కు కన్నడ రాదు. మేము మాట్లాడుకునేది అతడికి అర్ధం కాదు. ఇది మాకు కావాల్సిన ప్రైవసీ ఇచ్చింది. మనసులో మాట పంచుకునేందుకు ఇదే సరైన అవకాశంగా భావించాము’’ అని నాటి విషయాల్ని నారాయణమూర్తి చెప్పుకొచ్చారు.