ఎన్టీఆర్ వల్లే చంద్రబాబు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రులుగా రాణిస్తున్నారు: రేణుకా చౌదరి
- ఎంతో మందిని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తీసుకొచ్చారన్న రేణుక
- ఖమ్మంకు తనను దూరం చేయవద్దన్న ఫైర్ బ్రాండ్
- టీడీపీ మద్దతుతోనే బీఆర్ఎస్ ను తరిమేశామని వ్యాఖ్య
తాను ఖమ్మం జిల్లా ఆడబిడ్డనని, తనకు కొత్తకొత్త బిరుదులు ఇచ్చి ఈ ప్రాంతానికి దూరం చేయవద్దని రేణుక కోరారు. రాజకీయాల్లో గోడలు మారొచ్చు కాని, పునాదులు మారవని చెప్పారు. టీడీపీ మద్దతుతోనే పదేళ్లుగా రాక్షస పాలన కొనసాగించిన బీఆర్ఎస్ ను ఇంటికి తరిమామని అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సభలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.