సరదాగా .. సందడిగా సాగిన 'గుంటూరు కారం' షూటింగ్.. మేకింగ్ వీడియో రిలీజ్!
- రేపు విడుదలవుతున్న 'గుంటూరు కారం'
- ప్రధానమైన బలంగా నిలిచే మాస్ కంటెంట్
- ఇప్పటికే పెరిగిపోయిన అంచనాలు
- కొత్త రికార్డులు ఖాయమంటున్న ఫ్యాన్స్
ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన నాయికలుగా శ్రీలీల - మీనాక్షి చౌదరి కనువిందు చేయనున్నారు. ముఖ్యమైన పాత్రలలో ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ .. సునీల్ .. జయరామ్ తదితరులు నటించారు. వాళ్లంతా కాంబినేషన్స్ సీన్స్ ను ఎంజాయ్ చేస్తూ చేయడం మేకింగ్ వీడియోలో కనిపిస్తోంది. ఈ సినిమా షూటింగు ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిందనే విషయం అర్థమవుతోంది.
ఈ కథ అంతా కూడా గుంటూరు నేపథ్యంలోనే జరుగుతుంది. మాస్ కంటెంట్ ఉన్న సినిమాలు ఇష్టపడేవాళ్లంతా కూడా ఈ సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ .. మహేశ్ బాబు మార్క్ యాక్షన్ .. శ్రీలీల గ్లామర్ ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలవనున్నాయి. ఓపెనింగ్స్ తోనే రికార్డులు సృష్టించడం ఖాయమనేది అభిమానులు చెబుతున్న మాట.