'సలార్' నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్!
- భారీ బడ్జెట్ తో రూపొందిన 'సలార్'
- ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో రేపు విడుదల
- హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్స్
- టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్
రవి బస్రూర్ స్వరపరిచిన ఈ పాటకి కృష్ణ కాంత్ సాహిత్యాన్ని అందించాడు. విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమాకి, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. కథ నేపథ్యం .. హీరో ఫ్యామిలీ అనుభవిస్తున్న వేదనను ఆవిష్కరిస్తూ ఈ పాట సాగుతుంది. హీరో .. అతని తల్లి .. ప్రియురాలు ముగ్గురూ భారమైన మనసులను ఈ పాట టచ్ చేస్తూ వెళుతుంది.
టైటిల్ దగ్గర నుంచి ఈ సినిమా అందరిలో అంచనాలను పెంచుతూ వెళ్లింది. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలోనే ఈ సినిమా కొత్త రికార్డును సృష్టించిందంటే, ఏ స్థాయిలో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాతో మలయాళం నుంచి పృథ్వీ రాజ్ సుకుమారన్ పరిచయమవుతున్నాడు.