కోడలు ఐశ్వర్య రాయ్‌ను అన్‌ఫాలో అయిన అమితాబ్!
- ఇన్‌స్టాలో బిగ్ బీ ఫాలో అవుతున్న వారిలో లిస్టులో కనిపించని ఐశ్వర్య
- బిగ్ బీ మనవడు నటించిన ‘ది ఆర్చీస్’ విడుదలైన కొన్ని రోజులకే ఘటన
- ఆశ్చర్యంలో అభిమానులు
అమితాబ్ మనవడు అగస్త్య నంద నటించిన ‘ది ఆర్చీస్’ ఇటీవలే విడుదలైంది. ముంబైలో ప్రదర్శించిన ఈ చిత్రం ప్రీమియర్‌కు అమితాబ్ కుటుంబసమేతంగా హాజరయ్యారు. ఐశ్వర్య, అమితాబ్..ఇలా అందరూ సంతోషంగా కెమెరాలకు పోజులిస్తూ కనిపించారు. ఇంతలోనే అమితాబ్ ఐశ్వర్యను అన్‌ఫాలో అయిన వార్త వైరల్‌గా మారింది. అయితే, కొందరు మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు. అమితాబ్ ఇన్‌స్టా అకౌంట్ సెట్టింగ్స్ కారణంగా ఆయన ఎవరినీ ఫాలో అవుతోందీ బహిరంగంగా తెలియకపోవచ్చని కొందరు కామెంట్ చేశారు. అయితే, ఈ కథనం అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. అభిషేక్, ఐశ్వర్య విడిపోతున్నారన్న వార్త కూడా చక్కర్లు కొడుతోంది.