కల్యాణ్ రామ్ సినిమాలో విజయశాంతి... ట్వీట్ చేసిన రాములమ్మ
- తనను ప్రాణంగా భావిస్తూ నా వెన్నంటి వున్న అభిమాన దైవాలకు అంటూ ట్వీట్
- మీ అభిమానం కోసం మళ్లీ ఓ సినిమా చేస్తున్నానని వెల్లడి
- కల్యాణ్ రామ్, దర్శక నిర్మాతలకు విజయశాంతి శుభాకాంక్షలు
'నన్ను తమ ప్రాణంగా భావిస్తూ జన్మంతా ఎన్నడూ నా వెన్నంటి ఉంటూనే ఉన్న నా అభిమాన దైవాలకు ఎన్నటికీ తీర్చుకోలేని కృతజ్ఞతతో... మీ కోసం..... నిజం చెప్పాలంటే మీ అభిమానం కోసం, మళ్లీ ఒక సినిమా చేస్తున్నాను...
5 దశాబ్ధాల ఈ నా సినీ గమనంలో మీ దీవెనలు ఎన్నటికీ , 1979 నుండి నేటి వరకు ఉన్నట్లు మీ విజయశాంతి కళాకారిణిగా ఉన్నంత వరకు ఎప్పటికీ అట్లనే ఉంటాయని విశ్వసిస్తూ.... నందమూరి కల్యాణ్ రామ్, దర్శకుడు ప్రదీప్ చార్ల, నిర్మాత సినిల్ బలుసు మరియు టీమ్‌కు బెస్ట్ విషెస్' అంటూ ట్వీట్ చేశారు.