ఉద్యోగం కోసం వేరే ఊరు వెళితే ఓటు తీసేయడం సరికాదు: నిమ్మగడ్డ
- గుంటూరు జిల్లా దుగ్గిరాలలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పర్యటన
- ఫారం-7 బాధితులతో కలిసి నిరసన ప్రదర్శన
- అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పణ
ఈ సందర్భంగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మాట్లాడుతూ, ఓటు హక్కుకు విఘాతం కలిగించేలా ఫారం-7 దరఖాస్తులు వస్తున్నాయని వెల్లడించారు. సొంతూరులో ఓటు హక్కు వినియోగించుకోవాలని అందరికీ ఉంటుందని, ఉద్యోగం కోసం వేరే ఊరు వెళితే ఓటు తీసేయడం సరికాదని అన్నారు.
గంపగుత్తగా ఫారం-7 దరఖాస్తులు అప్ లోడ్ చేసేవారిపై నియంత్రణ ఉండాలని నిమ్మగడ్డ సూచించారు. దుగ్గిరాలలో 23 మంది స్థానికుల ఓట్లకు ఫారం-7 పెట్టారని ఆరోపించారు. ఫారం-7 దరఖాస్తులపై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నామని చెప్పారు. ఓట్ల తొలగింపుపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశానని తెలిపారు.