త్రిషపై మన్సూర్ అలీఖాన్ రేప్ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందన
- త్రిషతో రేప్ సీన్ ఉంటుందని భావించానన్న మన్సూర్
- ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలన్న చిరంజీవి
- వక్ర బుద్ధితో కొట్టుమిట్టాడుతున్నారని మండిపాటు
త్రిష గురించి మన్సూర్ అలీఖాన్ చేసిన కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని చిరంజీవి తెలిపారు. ఈ వ్యాఖ్యలు కేవలం సినీ ఆర్టిస్టులకే కాకుండా ఏ మహిళకైనా లేదా ఏ అమ్మాయికైనా అసహ్యంగా ఉంటాయని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలను తీవ్ర పదజాలంతో ఖండించాలని అన్నారు. వక్ర బుద్ధితో వారు కొట్టుమిట్టాడుతున్నారని విమర్శించారు. త్రిషతో పాటు ఇలాంటి వ్యాఖ్యలకు బాధితులుగా మారిన ప్రతి మహిళకు తాను అండగా నిలబడతానని అన్నారు.