హాట్ స్టార్ లోకి అడుగుపెట్టిన 'అపూర్వ'
- హాట్ స్టార్ లో మొదలైన 'అపూర్వ' స్ట్రీమింగ్
- టైటిల్ రోల్ ను పోషించిన తార సుతారియా
- ఆమె నటనే ఈ సినిమాకి హైలైట్
- కీలక పాత్రలను పోషించిన రాజ్ పల్ యాదవ్ - అభిషేక్ బెనర్జీ
'చంబల్' లో ఒక గ్యాంగ్ సుపారీ తీసుకుని హత్యలు చేస్తూ ఉంటుంది. అలా వాళ్లు ఒక మర్డర్ చేసి వెళుతుండగా ఒక అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన కారణంగానే 'అపూర్వ' ఆ గ్యాంగ్ చేతికి చిక్కుతుంది. ఆమెను అనుభవించాలనే కోరికతో కిడ్నాప్ చేస్తారు.
ఆ హంతకుల బారి నుంచి తప్పించుకోవడానికి అపూర్వ ఏం చేస్తుంది? అందుకోసం ఆమె చేసిన ప్రయత్నాలు ఎలాంటివి? అనేవి ఆసక్తిని రేకెత్తించే అంశాలు. ఫొటోగ్రఫీ పరంగా .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ సినిమా, త్వరలో మిగతా భాషల్లోను అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.