వన్డే బౌలింగ్ ర్యాంక్స్‌లో కీలక మార్పు.. అగ్రస్థానాన్ని కోల్పోయిన సిరాజ్.. ఇప్పుడు నెం 1 ఎవరంటే..!
- నంబర్ 1 వన్డే బౌలర్‌గా అవతరించిన దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్
- రెండో స్థానానికి పడిపోయిన టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్
- వరుసగా 4, 5వ స్థానాల్లో బుమ్రా, కుల్దీప్ యాదవ్
భారత్ గతవారంలో ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడింది. దీంతో సిరాజ్ పెద్దగా రాణించేందుకు అవకాశం లేదు. మరోవైపు టీమిండియా మరో పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తమ ర్యాంక్స్‌ను మెరుగుపరుచుకున్నారు. 687 రేటింగ్ పాయింట్లతో బుమ్రా 4వ స్థానంలో, 682 రేటింగ్ పాయింట్లతో కుల్దీప్ 5వ స్థానంలో నిలవడం గమనార్హం. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ 2వ ర్యాంకులో నిలిచాడు. విరాట్ కోహ్లీ (4), రోహిత్ శర్మ (5) టాప్-10లో చోటు దక్కించుకున్నారు.