రామ్ చరణ్ ఇంట్లో హీరోల సందడి.. దీపావళి విందు.. ఫొటోలు ఇవిగో!
- ఫ్యామిలీతో పార్టీకి హాజరైన వెంకీ, తారక్, మహేశ్ బాబు
- రామ్ చరణ్ దంపతుల కుమార్తె క్లింకారాకు తొలి దీపావళి సందర్భంగా గ్రాండ్ పార్టీ
- శనివారం రాత్రి తమ నివాసంలో విందు ఏర్పాటు
టాలీవుడ్ కు చెందిన పలువురు నటీనటులు, డైరెక్టర్లు, నిర్మాతలు కూడా రామ్ చరణ్ ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ఈ పార్టీకి సంబంధించిన కొన్ని ఫొటోలను మహేశ్ బాబు సతీమణి నమ్రత తన ఇన్ స్టాలో షేర్ చేశారు. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా, ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నారు. కియారా ఆడ్వాణీ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.



