రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో.. భవిష్యత్తును తలుచుకుంటే భయం వేస్తోందన్న నాగచైతన్య
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రష్మిక డీప్ ఫేక్ వీడియో
- జరా పటేల్ వీడియోను మార్ఫింగ్ చేసిన దుండగులు
- బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన నాగచైతన్య
టెక్నాలజీ ఎలా దుర్వినియోగం అవుతోందో చూస్తుంటే చాలా నిరుత్సాహంగా ఉందని నాగచైతన్య అన్నాడు. భవిష్యత్తులో ఈ దుర్వినియోగం ఏ స్థాయికి పోతుందో అని ఆలోచిస్తేనే భయం కలుగుతోందని చెప్పాడు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఇలాంటి చర్యల వల్ల బాధితులుగా మారే వారిని రక్షించేందుకు కఠిన చట్టాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పాడు. రష్మికకు బలం చేకూరాలని ఆకాంక్షించాడు.