మంచు విష్ణు ఆరోగ్యంపై మోహన్ బాబు హెల్త్ అప్డేట్
- న్యూజిలాండ్‌లో కన్నప్ప మూవీ షూటింగ్ సందర్భంగా హీరో మంచు విష్ణు చేతికి గాయం
- షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేత
- విష్ణు కోలుకుంటున్నాడని, త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుందని వెల్లడి
కన్నప్ప మూవీ తన డ్రీమ్ ప్రాజెక్టు అని విష్ణు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మారు హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్న విష్ణు ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. సీనియర్ నటుడు మోహన్ బాబు స్వయంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కన్నడ హీరో శివకుమార్, లేడీ సూపర్ స్టార్ నయనతార కీలక పాత్రలు పోషిస్తున్నారు.