భర్తకు అండగా రంగంలోకి సుధామూర్తి
- నారాయణమూర్తి వారంలో సుమారు 90 గంటలు పనికే కేటాయిస్తారన్న సుధామూర్తి
- కష్టించి పనిచేయడంపై తన భర్తకు అచంచల విశ్వాసమని వెల్లడి
- తను ఆచరించేదే యువతకు చెప్పారని స్పష్టీకరణ
జీవితంలో కష్టించి పనిచేస్తేనే విజయం సాధ్యమని తన భర్త బలంగా నమ్ముతారని సుధామూర్తి చెప్పుకొచ్చారు. నారాయణ మూర్తి స్వయంగా వారానికి దాదాపు 90 గంటలు పనిచేస్తారని తెలిపారు. ‘‘ఆయన వారంలో 80-90 గంటలు పనికే కేటాయిస్తారు. అంతకంటే తక్కువ పనిచేయడం అంటే ఏంటో ఆయనకు తెలీదు. మనిషి కష్టించి పనిచేయాలనేది ఆయన నమ్మకం. తన జీవితమంతా ఇలాగే గడిపారు. తన మనసుకు అనిపించిందే చెప్పారు’’ అని సుధామూర్తి స్పష్టం చేశారు. నారాయణమూర్తి తన జీవితానుభవాన్నే యువతతో పంచుకున్నారని చెప్పుకొచ్చారు.