హరీశ్ రావుపై పోటీ చేయడానికి నేను సిద్ధం: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- రాష్ట్రంలో కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని కోమటిరెడ్డి విమర్శ
- రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని మండిపాటు
- నియంత పాలనకు చరమగీతం పలికేందుకే నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారని విమర్శ
ఈ తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రంలో కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే లబ్ధి పొందిందని కోమటిరెడ్డి దుయ్యబట్టారు. రూ. 5 లక్షల కోట్ల అప్పులు చేసి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని విమర్శించారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పలికేందుకే వివిధ పార్టీల నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలను ప్రతి గ్రామంలో ప్రచారం చేసి రాష్ట్రంలో ఘన విజయం సాధించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.