వైరల్ అవుతున్న అమితాబ్ 'కల్కి 2898 ఏడీ' మూవీ పోస్టర్.. స్పందించిన బిగ్ బీ
- కల్కి 2898 ఏడీ సినిమాలో నటిస్తున్న అమితాబ్
- అభిమానుల ప్రేమాభిమానాలకు పులకించిపోయిన బిగ్‌బీ
- బర్త్ డే నాడు అభిమానులను వ్యక్తిగతంగా కలవలేకపోయినందుకు విచారం
- వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానున్న సినిమా
సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్, దీపిక పదుకొణె ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీతోపాటు యాక్షన్ డ్రామా చిత్రం ‘గణపతి: ఏ హీరో ఈజ్ బార్న్’లోనూ బిగ్ బీ నటిస్తున్నారు. దీనికి వికాశ్ బల్ దర్శకత్వం వహిస్తున్నారు. టైగర్ ష్రాఫ్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 20న ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే, రజనీకాంత్ తలైవర్ 170లోనూ అమితాబ్ నటిస్తున్నారు.