చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ ప్రారంభం
- ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న ఏఏజీ పొన్నవోలు
- చంద్రబాబు తరపున వాదిస్తున్న ప్రమోద్ కుమార్ దూబే
- చంద్రబాబును మళ్లీ కస్టడీకి కోరడంలో అర్థం లేదన్న దూబే
చంద్రబాబు తరపున ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపిస్తున్నారు. పొన్నవోలు వాదనలపై దూబే అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబును ఇప్పటికే రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారని.. విచారణకు చంద్రబాబు పూర్తిగా సహకరించారని చెప్పారు. కస్టడీ ముగిసినా ఇంత వరకు కేసు డైరీని సమర్పించలేదని తెలిపారు. దీంతో, కేసు డైరీ ఎక్కడుందని సీఐడీ అధికారులను జడ్జి ప్రశ్నించారు. చంద్రబాబును మళ్లీ కస్టడీకి కోరడంలో అర్థం లేదని చెప్పారు.