రూ. 50కే ఏడాది అమెజాన్.. రూ. 20కే నెలంతా నెట్ ఫ్లిక్స్ అంటూ సందేశాలా.. లింక్ క్లిక్ చేస్తే ఖాతా ఖాళీనే!
- ఓటీటీ సబ్ స్క్రయిబర్లనూ వదలని సైబర్ నేరగాళ్లు
- తక్కువ రేటుకే ఓటీటీ ఆఫర్లు అంటూ ఎర
- హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో మోసాలు
మంచి ఆఫర్ అనుకుని లింకు క్లిక్‌చేసి.. ఓటీపీ నమోదు చేసిన వారి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో ఈ తరహా కేసులు నమోదవుతున్నాయి. ఓటీటీ సంస్థలు నెలవారీ, వార్షిక గడువు ముగిస్తే పునరుద్ధరించుకోవడానికి ఖాతాలో రిజిస్టర్ చేసిన ఈమెయిల్‌కు సందేశం పంపిస్తాయి. సైబర్ ముఠాలు కూడా ఇలాంటి తరహాలోనే సందేశాలు పంపించి అమాయకులను బోల్తా కొట్టిస్తున్నారు. ఇలాంటి నకిలీ ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, సైబర్ నిపుణులు ప్రజలకు సూచిస్తున్నారు.