ద్వంద్వ ప్రమాణాల ప్రపంచం: గ్లోబల్ నార్త్‌పై జైశంకర్
- మార్పు కోసం రాజకీయ సంకల్పం కంటే రాజకీయ ఒత్తిడి ఎక్కువగా ఉందన్న జైశంకర్
- భద్రతా మండలిలో ఇలాంటి తీరును ఎక్కువగా గమనిస్తామని వ్యాఖ్య
- సంపూర్ణ పరివర్తన కోసం గ్లోబల్ సౌత్ ఒత్తిడి తెస్తుంటే గ్లోబల్ నార్త్ అడ్డుకుంటుందన్న జైశంకర్
మార్పు కోసం రాజకీయ సంకల్పం కంటే రాజకీయ ఒత్తిడి ఎక్కువగా ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. ఆధిపత్య స్థానాల్లో ఉన్న దేశాలు మార్పును ప్రతిఘటిస్తున్నాయన్నారు. భద్రతా మండలిలో ఇలాంటి తీరును ఎక్కువగా గమనిస్తుంటామన్నారు. ఆర్థిక ఆధిపత్యం కలిగినవారు తమ ఉత్పత్తి సామర్థ్యాలను ఉపయోగించుకుంటారని, సంస్థాగత లేదా చారిత్రక ప్రభావం ఉన్నవారు ఆ సామర్థ్యాలను ఆయుధాలుగా మార్చుకుంటున్నారన్నారు. వారు సరైన విషయాలే చెబుతారు కానీ, వాస్తవమేమంటే ఇది ద్వంద్వ ప్రమాణాల ప్రపంచమన్నారు. ఇందుకు కోవిడ్ మంచి నిదర్శనమన్నారు.
సంపూర్ణ పరివర్తన కోసం అంతర్జాతీయ వ్యవస్థ పై గ్లోబల్ సౌత్ మరింత ఒత్తిడిని తెస్తోందన్నారు. కానీ గ్లోబల్ నార్త్, అలాగే మరిన్ని దేశాలు అడ్డుకుంటున్నాయన్నారు. సాంస్కృతిక బ్యాలెన్స్ అంటే వైవిధ్యాన్ని గుర్తించడం, గౌరవించడమే కాదని, ఇతర సంస్కృతులను, సంప్రదాయాలకు తగిన గౌరవం కూడా ఇవ్వాలన్నారు. కాగా, గ్లోబల్ నార్త్ అనే పదాన్ని అభివృద్ధి చెందిన దేశాలకు, గ్లోబల్ సౌత్ అనే పదాన్ని అభివృద్ధి చెందుతోన్న, అభివృద్ధి చెందని దేశాలకు ఉపయోగిస్తారు.