సెన్సార్ లో కట్ చేసిన సీన్లతో ఓటీటీలోకి ఖుషి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
- వచ్చే నెల 1న స్ట్రీమింగ్ చేయనున్న నెట్ ఫ్లిక్స్
- ఓటీటీలో పెరగనున్న సినిమా రన్ టైం
- విజయ దేవరకొండ, సమంతల అందమైన ప్రేమకథ
ఖుషి సినిమాకు ఓపెనింగ్స్ బాగానే ఉన్నప్పటికీ లాంగ్ రన్ లో కలెక్షన్స్ తగ్గాయి. తాజాగా ఓటీటీలో ఈ సినిమా సందడి చేయనుంది. థియేటర్లలో రిలీజ్ చేసిన దానికంటే ఈ సినిమా నిడివి పెరగనున్నట్లు తెలుస్తోంది. విజయ దేవరకొండ, సమంతల మధ్య వచ్చే పలు రొమాంటిక్ సన్నివేశాలు సెన్సార్ లో కట్ అయ్యాయి. ఓటీటీ రిలీజ్ కోసం వాటిని తిరిగి కలపనున్నారు. సెన్సార్ కట్ చేసిన సీన్స్ కలపడంతో సినిమా రన్ టైం పెరగనుందని పరిశ్రమ వర్గాల సమాచారం.