చియాన్ విక్రమ్ మూవీ రిలీజ్ డేట్ ఖరారు!
- విక్రమ్ తాజా చిత్రంగా 'ధృవనచ్ఛిత్తిరం'
- 'స్పై' యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
- కథానాయికలుగా రీతూ వర్మ - ఐశ్వర్య రాజేశ్
- నవంబర్ 24వ తేదీన సినిమా విడుదల
స్పై యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన సినిమా ఇది. నవంబర్ 24వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, కొంతసేపటి క్రితం ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. వివిధ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా, రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది.
రీతూ వర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ఐశ్వర్య రాజేశ్ కీలకమైన పాత్రలో కనిపించనుంది. హారీస్ జైరాజ్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. మనోజ్ పరమహంస కెమెరా పనితనం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. పార్తీబన్ .. వినాయకన్ .. రాధిక .. సిమ్రాన్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.