‘డెవిల్’ నుంచి ఫస్ట్ మెలోడీ.. ఆకట్టుకునేలా కల్యాణ్ రామ్, సంయుక్త రొమాన్స్
- అభిషేక్ నామా దర్శకత్వంలో వస్తున్న స్పై థ్రిల్లర్
- ఐదు భాషల్లో ప్యాన్ ఇండియా స్థాయిలో రానున్న చిత్రం
- నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు
'మాయే చేసి మెల్లగా.. మది దోచేసింది సిన్నగా.. చూపే చూసి సన్నగా’ అంటూ సాగిన ఈ మెలోడీ సాంగ్‌లో కల్యాణ్ రామ్, సంయుక్త వింటేజ్ లుక్‌లో కనిపించారు. ఇద్దరి మధ్య రొమాన్స్ ఆకట్టుకునేలా ఉంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు సత్య ఆర్.వి సాహిత్యం అందించారు. బృంద మాస్టర్ నృత్యం అందించింది. ఈ సినిమా నవంబర్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.