నా మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు... లోకేశ్ కు ఫోన్ చేసి ధైర్యం చెప్పిన రజనీకాంత్
- స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్
- రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత
- లోకేశ్ కు ఫోన్ చేసి మాట్లాడిన రజనీకాంత్
- చంద్రబాబు చేసిన అభివృద్ధి, సంక్షేమమే ఆయనకు రక్ష అని వెల్లడి
తన మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు అని, ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమమే ఆయనకు రక్ష అని ఈ సందర్భంగా రజనీకాంత్ పేర్కొన్నారు. చంద్రబాబు ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప నేత అని కొనియాడారు. ఈ తప్పుడు కేసులు... అక్రమ అరెస్టులు ఆయనని ఏం చేయలేవని రజనీకాంత్ ధీమా వ్యక్తంచేశారు.
తనకు ఆత్మీయ మిత్రుడైన చంద్రబాబు తప్పు చేయరని, చేసిన మంచి పనులు, నిస్వార్థమైన ప్రజా సేవ, ఆయనను క్షేమంగా బయటకు తీసుకొస్తాయని పేర్కొన్నారు.