తారక్ అస్సలు కేర్ చేయడం లేదు.. ఇక టీడీపీ ఫ్యూచర్ దబిడి దిబిడే: ఆర్జీవీ
- బాబు అరెస్ట్‌పై ఆర్జీవీ మరో ట్వీట్
- ఈ విషయాన్ని తారక్ పట్టించుకోవడం లేదన్న ఆర్జీవీ
- ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు
బాబుకు కేటాయించిన ఖైదీ నెంబర్.. గత ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన అసెంబ్లీ సీట్లతో సమానం అంటూ లెక్కగట్టడం నుంచి ఏపీ బంద్‌ను ప్రజలు పట్టించుకోలేదంటూ ట్వీట్లు చేశారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తెచ్చారు. చంద్రబాబు అరెస్టును తారక్ కనీసం పట్టించుకోలేదన్నారు. దీన్నిబట్టి టీడీపీ భవిష్యత్తు దబిడి దిబిడే అని స్పష్టంగా అర్థమవుతోందన్నారు.