పవన్ కల్యాణ్ స్పీచ్ షేర్ చేయగానే తనను టార్గెట్ చేశారంటున్న యాంకర్ రష్మి
- సనాతన ధర్మానికి మద్దతుగా మాట్లాడిన జనసేన అధినేత
- దీన్ని షేర్ చేసినందుకు తనను విమర్శిస్తున్నారని రష్మి ఆవేదన
- తాను నమ్మే దేవుడిని.. తన విశ్వాసాన్ని తిట్టొద్దని హెచ్చరిక
‘నేను ఈ ఒక్క పోస్ట్‌ను షేర్ చేయగానే నన్ను అంతా టార్గెట్ చేసుకున్నారు. తమకు వాక్ స్వాతంత్ర్యం ఉందంటూ చాలా మంది దీనిపై వాదిస్తున్నారు. కానీ, నేను నమ్ముతున్న ధర్మం వైపు ఉంటానని చెప్పినందుకు నేను విమర్శలు ఎదుర్కోవాలా? సిగ్గుపడలా? నేను మీ నాస్తికత్వాన్ని ప్రశ్నించడం లేదు. అలాంటప్పుడు నా విశ్వాసాలను మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? కొందరు కులాల సమస్యలను ప్రస్తావిస్తున్నారు. అసలు ఏ మతం సరైనదో చెప్పండి. తీవ్రవాదులు, అతివాదులు లేని మతం ఏదో చెప్పండి? కేవలం మీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయని కుటుంబాన్ని మార్చుకోలేరు కదా? అన్ని మతాలకు మూల సూత్రం ఒకటే ఉంది. అదే బ్రతకండి.. బ్రతకనివ్వండి. అంతే తప్ప నా దేవుడిని, నా విశ్వాసాన్ని తిట్టొద్దు’ అని ట్వీట్ చేసింది.