నేడు బీజేపీలో చేరనున్న చికోటి ప్రవీణ్
- కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరనున్న చికోటి ప్రవీణ్
- భారీ ర్యాలీతో బీజేపీ ఆఫీస్ కు చేరుకోనున్న ప్రవీణ్
- కేసీఆర్ అక్రమాలను బీజేపీ మాత్రమే అడ్డుకోగలదని వ్యాఖ్య
ఈ సందర్భంగా చికోటి ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని మోదీ స్ఫూర్తితోనే బీజేపీలో చేరుతున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అక్రమాలను బీజేపీ మాత్రమే అడ్డుకోగలదని, అందుకే బీజేపీలో చేరుతున్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. మరోవైపు, కేసినో కేసుల్లో ప్రవీణ్ ను ఈడీ కూడా విచారించిన సంగతి తెలిసిందే.