మంచు విష్ణు కలల ప్రాజెక్టు ‘కన్నప్ప’లోకి ప్రభాస్!
- కీలక పాత్ర పోషిస్తున్నట్టు వార్తలు
- విషయం చెబుతూ ట్వీట్ చేసిన సినీ విమర్శకుడు రమేష్ బాలా
- హరహర మహాదేవ్ అంటూ స్పందించిన మంచు విష్ణు
మంచు విష్ణు కలల ప్రాజెక్టులో రెబల్ స్టార్ ప్రభాస్ కీలక పాత్ర పోషిస్తాడన్న వార్త హల్ చల్ చేస్తోంది. ప్రముఖ విమర్శకుడు రమేష్ బాలా ఈ విషయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించారు. సినిమాలో ప్రభాస్ ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసిందని పేర్కొన్నారు. ఈ ట్వీట్ కి మంచు విష్ణు బదులిస్తూ.. 'హరహర మహాదేవ్' అంటూ రీట్వీట్ చేశాడు. దాంతో, ప్రభాస్ నిజంగానే ఈ చిత్రంలో నటిస్తున్నాడా? నటిస్తే ఏ పాత్రలో కనిపిస్తాడు? అన్నది ఆసక్తి కలిగిస్తోంది.
.