ఉదయనిధిపై చర్యలు కోరుతూ గవర్నర్కు సుబ్రహ్మణ్యస్వామి లేఖ
- సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేసిన ఉదయనిధిపై చర్యలు తీసుకోవాలని కోరిన స్వామి
- ప్రాసిక్యూట్కు అనుమతి కోరుతూ గవర్నర్కు లేఖ పంపించినట్లు వెల్లడి
- మరోసారి సనాతన ధర్మంపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టీకరణ
సనాతన ధర్మంపై ఇష్టారీతిన మాట్లాడిన వ్యక్తి మంత్రి అని, ఓ పబ్లిక్ ఫిగర్ అని స్వామి పేర్కొన్నారు. ఆయన చేసే వ్యాఖ్యలు ఎక్కువమందికి చేరుకుంటాయని, ఆ వ్యాఖ్యలు సనాతన ధర్మ సమాజంలో ఆందోళనలు కలిగించాయన్నారు. ఉదయనిధి పార్టీ తమిళనాడులో అధికారంలో ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో అశాంతిని రేపేలా ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకొని, ఆయనపై తక్షణమే ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వాలని కోరారు.