భారత్ మాతాకీ జై అంటూ అమితాబ్ బచ్చన్ ట్వీట్!
- తొలిసారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్థానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్
- రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వాన పత్రికల్లో 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అంటూ మార్పు
- ఇదే సమయంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ ట్వీట్
కేంద్ర ప్రభుత్వం ఇండియా పేరును భారత్‌గా మార్చనుందనే ప్రచారం సాగుతోన్న సమయంలోనే అమితాబ్ 'భారత్ మాతాకీ జై' అని ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మేరకు సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చోట ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉపయోగించడం ఇదే మొదటిసారి.