ఏపీ నేతలకు తెలంగాణలో ఏం పని?: షర్మిలపై రేణుకా చౌదరి వ్యాఖ్యలు
- షర్మిల పాలేరు నుంచి పోటీచేస్తాననడంపై రేణుక ఫైర్
- అధిష్ఠానం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్న రేణుక
- షర్మిల ముందు అమరావతి రైతుల గురించి మాట్లాడాలని వ్యాఖ్యలు
- తాను ఏపీ కోడల్ని అని రేణుక వెల్లడి
తెలంగాణ కోడలు అని షర్మిలకు ఇప్పుడు గుర్తొచ్చిందా? అంటూ ఎత్తిపొడిచారు. ఏపీ నేతలకు తెలంగాణలో ఏం పని? అంటూ సూటిగా ప్రశ్నించారు. ముందు అమరావతి రైతుల గురించి షర్మిల మాట్లాడాలని స్పష్టం చేశారు. ఇక, తాను ఏపీ కోడల్ని అని, తెలంగాణ ఆడబిడ్డను అని రేణుక వెల్లడించారు.