అది నా అలవాటు.. సీఎం యోగికి పాదాభివందనం చేయడంపై రజనీకాంత్ వివరణ
- సీఎం యోగికి రజినీకాంత్ పాదాభివందనంతో కాంట్రవర్సీ
- యోగులు, సన్యాసులు తనకంటే చిన్నవారైనా పాదాభివందనం చేస్తానంటూ రజనీ వివరణ
- జైలర్‌ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన సూపర్ స్టార్
ఈ ఉదంతంపై రజని తాజాగా స్పందించారు. సన్యాసులు, యోగులూ తన కంటే చిన్నవారైనా సరే పాదాభివందనం చేయడం తనకు అలవాటంటూ ఒక్క ముక్కలో ఈ వివాదానికి ముగింపు పలికారు. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు రజనీకాంత్ ఈ మేరకు సమాధానం చెప్పారు. 2024 ఎన్నికలకు సంబంధించి మరో ప్రశ్న ఎదురవగా తాను రాజకీయాల గురించి మాట్లాడనని స్పష్టం చేశారు. తన తాజా చిత్రం ‘జైలర్’ను ఆదరిస్తున్న ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.