కొందరు తెలివైన శాడిస్టులు అన్నయ్యను పొగుడుతూ, తమ్ముడిని తిడతారు: 'భోళాశంకర్' ఈవెంట్ లో హైపర్ ఆది
- అన్నయ్య మంచోడు కాబట్టి ముంచేశారన్న ఆది
- తమ్ముడు మొండోడని... అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తారని వ్యాఖ్య
- ఎలెక్షన్స్ గురించి మాట్లాడాల్సిన వాళ్లు కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా
తాను పాలిటిక్స్ ఫాలో కావడం లేదని షూటింగ్ సమయంలో చిరంజీవి గారు తనకు చెప్పారని... ఎందుకు అని తాను అడిగానని... తమ్ముడిని తిడుతుంటే తాను చూడలేనని ఆయన చెప్పారని ఆది తెలిపాడు. అన్నయ్య మంచోడు కాబట్టి ముంచేశారని, తమ్ముడు మొండోడని, అన్నయ్యని తిట్టిన ప్రతి ఒక్కరికీ వడ్డీతో సహా చెల్లిస్తారని చెప్పాడు. ఎలెక్షన్స్ గురించి మాట్లాడాల్సిన వాళ్లు సినిమా కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశాడు. వాళ్లు వెనకేసుకున్న కలెక్షన్ల్ తో పోల్చుకుంటే మన కలెక్షన్స్ తక్కువేనని సెటైర్ వేశాడు. 'బ్రో' సినిమా కలెక్షన్స్ పై కొందరు వైసీపీ నేతలు మాట్లాడిన సంగతి తెలిసిందే.