ఢిల్లీకి చేరుకున్న జయసుధ.. నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్న ప్రముఖ నటి
- సాయంత్రం బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న జయసుధ
- కార్యక్రమానికి హాజరుకానున్న కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్
- 2009లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన జయసుధ
పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, బండి సంజయ్ ఢిల్లీలో ఉన్నారు. జయసుధ బీజేపీలో చేరే కార్యక్రమంలో వీరు పాల్గొననున్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి జయసుధ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు కూడా ఆమె సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ టికెట్ ను ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. మరి బీజేపీ ఆమెకు టికెట్ ఇస్తుందా? లేదా పార్టీలో ఇతర బాధ్యతలను అప్పగిస్తుందా? అనే విషయం వేచి చూడాలి.