గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు, కుర్రా సత్యనారాయణ
- ముగిసిన ఫారూఖ్ హుస్సేన్, రాజేశ్వరరావు పదవీకాలం
- వారి స్థానాలను దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణతో భర్తీ చేయాలని నిర్ణయం
- కేబినెట్ సమావేశంలో ఆమోదం
దాసోజు శ్రవణ్ గతంలో ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీల్లో పనిచేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ హైదరాబాద్ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన బీసీ వర్గాల గొంతుకను బలంగా వినిపించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తమ పేర్లను ప్రతిపాదించడంపై దాసోజు, కుర్రా సత్యనారాయణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.