‘దేవర’లో ఎన్టీఆర్ ఏ రేంజ్‌లో భయపెడతాడో చెప్పిన కొరటాల శివ
- కొరటాల శివ దర్శకత్వంలో దేవరలో నటిస్తున్న ఎన్టీఆర్
- వచ్చే ఏప్రిల్ 5న విడుదల కానున్న చిత్రం
- ప్రత్యేక వీడియోను విడుదల చేసిన చిత్ర బృందం
వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది. 250 రోజుల్లో సినిమా విడుదల కాబోతోందంటూ ఓ ప్రత్యేక వీడియోను చిత్ర బృందం నిన్న సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ వీడియోలో కొరటాల శివ మాట్లాడుతూ ‘దేవర’లో ఎన్టీఆర్ పాత్రపై అంచనాలు పెంచేశారు. ‘ఈ కథలో మనుషుల కంటే ఎక్కువగా మృగాలు ఉంటాయి. వాళ్లకు దేవుడు, చావు అంటే భయం లేదు. ఒకే ఒక్కటంటే భయం. ఆ భయం ఉండాలి.. అవసరం. భయపెట్టడానికి ఈ సినిమా ప్రధాన పాత్ర ఏ రేంజ్ కు వెళ్తుందనేది ఎమోషనల్ రైడ్’ అంటూ చెప్పుకొచ్చారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.