కళ్లు చెదిరే భారీ ధరకు కమలహాసన్ ఇండియన్-2 డిజిటల్ రైట్స్!
- శంకర్ దర్శకత్వంలో భారతీయుడు చిత్రానికి సీక్వెల్
- కమల్ కెరీర్ లో మరో భారీ చిత్రం
- నెట్ ఫ్లిక్స్ కు ఇండియన్-2 డిజిటల్ హక్కులు!
- దాదాపు రూ.200 కోట్లకు డీల్!
కాగా, ఇండియన్-2 చిత్రానికి సంబంధించి తాజా సమాచారం తెరపైకి వచ్చింది. ఈ పాన్ ఇండియా చిత్రం డిజిటల్ హక్కులు కళ్లు చెదిరే ధరకు అమ్ముడైనట్టు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇండియన్-2 డిజిటల్ రైట్స్ దాదాపు రూ.200 కోట్లకు నెట్ ఫ్లిక్స్ ఓటీటీ దక్కించుకున్నట్టు టాక్ వినిపిస్తోంది.
లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్లపై సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ ఇండియన్-2 సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్జే సూర్య, సముద్రఖని, బాబీ సింహా తదితరులు నటిస్తున్నారు.