రేపే 'బ్రో' ప్రీ రిలీజ్ ఈవెంట్!
- ఈ నెల 28వ తేదీన విడుదల కానున్న 'బ్రో'
- రేపు శిల్పకళా వేదికలో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్
- అభిమానుల్లో ఇప్పటికే పెరిగిన అంచనాలు
- వసూళ్ల పరంగా కొత్త రికార్డులు ఖాయమనే టాక్
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకి ప్లాన్ చేశారు. ఈ నెల 25వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాదులోని శిల్పకళావేదికలో నిర్వహించనున్నారు. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. కొంతసేపటి క్రితమే ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఇది రెగ్యులర్ గా కనిపించే పాయింట్ కాదు. మొదటి నుంచి చివరివరకూ వినోదభరితంగా సాగే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే - సంభాషణలు త్రివిక్రమ్ అందించడం వలన, అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. రీసెంట్ గా వదిలిన ట్రైలర్ తో ఈ సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగింది. వసూళ్ల పరంగా ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందేమో చూడాలి.