ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ నుంచి అప్‌డేట్.. ఫస్ట్ గ్లింప్స్ ఎప్పుడంటే..!
- నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా
- కీలక పాత్రల్లో అమితాబ్, కమల హాసన్, దీపిక
- సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ కె టైటిల్, గ్లింప్స్ విడుదల తేదీ ఖరారైంది. అమెరికాలో ఈ నెల 20న, ఇండియాలో 21న టైటిల్, గ్లింప్స్ విడుదల కానున్నాయి. 20న శాన్ డియాగో కామిక్ కాన్‌లో జరిగే ఈ వేడుకకు ప్రభాస్, కమలహాసన్, దీపికా పదుకొణే, నాగ్ అశ్విన్, చిత్ర నిర్మాతలు హాజరుకానున్నారు. భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయిలో నిర్మితం అవుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.