మరో ప్రాజెక్టును లైన్లో పెట్టేసిన నిఖిల్!
- నిఖిల్ ను నిరాశపరిచిన 'స్పై'
- షూటింగు దశలో 'స్వయంభూ'
- మరో ప్రాజెక్టుకి ఖరారు కానున్న టైటిల్
- వీఐ ఆనంద్ దర్శకత్వంలో మరో సినిమాకి సన్నాహాలు
ప్రస్తుతం నిఖిల్ రామ్ వంశీకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి 'ది ఇండియా హౌస్' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మరో వైపున 'స్వయంభూ' సినిమాను కూడా ఆయన పూర్తిచేసే పనిలో ఉన్నాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యుద్ధవీరుడిగా నిఖిల్ కనిపించనున్నాడు.
ఇక ఆ తరువాత ప్రాజెక్టును కూడా ఆయన లైన్లో పెట్టినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. గతంలో నిఖిల్ తో 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' సినిమాను చేసిన వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టు చెబుతున్నారు. త్వరలో అధికారిక ప్రకటన వదలనున్నారని అంటున్నారు. వీఐ ఆనంద్ కథలు .. కాన్సెప్టులు డిఫరెంట్ గా ఉంటాయనే సంగతి తెలిసిందే.