జాం జాం జజ్జనక... పూర్తి పాట విడుదల చేసిన భోళాశంకర్ చిత్రబృందం
- చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళాశంకర్
- మహతి స్వరసాగర్ సంగీతం
- జాం జాం జజ్జనక గీతానికి కాసర్ల శ్యామ్ సాహిత్యం
- ఆలపించిన అనురాగ్ కులకర్ణి, మంగ్లీ
- ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వస్తున్న భోళాశంకర్
ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భోళాశంకర్ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో చిరంజీవి సరసన తమన్నా నటిస్తుండగా, చిరంజీవికి చెల్లెలిగా కీర్తిసురేశ్ కీలక పాత్ర పోషిస్తోంది.
సుశాంత్, తరుణ్ అరోరా, వెన్నెల కిశోర్, మురళీశర్మ, బ్రహ్మాజీ, ఉత్తేజ్, శ్రీముఖి, సితార, హైపర్ ఆది, గెటప్ శ్రీను తదితరులు ఇతర పాత్రధారులు.