'గేమ్ చేంజర్' కోసం ఫైట్లు చేయనున్న రామ్ చరణ్
- శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్
- హైదరాబాదులో జులై 11 నుంచి కొత్త షెడ్యూల్
- రామ్ చరణ్ పై యాక్షన్ సీక్వెన్స్ ల చిత్రీకరణ
ఆచితూచి ఖర్చు చేస్తాడని, మీడియం బడ్జెట్ సినిమాలు చేస్తాడని పేరున్న దిల్ రాజ్ గేమ్ చేంజర్ కోసం భారీ బడ్జెట్ తో ముందుకు రావడం విశేషం. ఆర్ఆర్ఆర్ తో అంతర్జాతీయ ఇమేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్, క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శంకర్, హిట్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే దిల్ రాజు... ఈ ముగ్గురి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో హైప్ ఓ రేంజిలో కొనసాగుతోంది.
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ వస్తుందని భావిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.