రాజకీయాలను పక్కనపెట్టి సన్నిహితుడి పాడె మోసిన బండి సంజయ్
- గుండెపోటుతో హఠాన్మరణం చెందిన బీఆర్ఎస్ నాయకుడు మహేందర్‌రెడ్డి
- అంత్యక్రియలకు వేర్వేరుగా హాజరైన బండి, కౌశిక్‌రెడ్డి
- బీఆర్ఎస్‌లో చేరకముందు 20 ఏళ్లపాటు ఏబీవీపీ, బీజేపీలో పనిచేసిన మహేందర్‌రెడ్డి
బీఆర్ఎస్‌లో చేరకముందు ఆయన రెండు దశాబ్దాలపాటు ఏబీవీపీ, బీజేపీలో పనిచేశారు. బండి సంజయ్‌కు సన్నిహితుడిగా ఉన్నారు. 2021లో హుజారాబాద్ ఉప ఎన్నిక సమయంలో బీఆర్ఎస్‌లో చేరిన తర్వాత కౌశిక్‌రెడ్డితో ఆయనకు సాన్నిహిత్యం పెరిగింది. నిన్న ఆయన అంత్యక్రియలకు సంజయ్, కౌశిక్ వేర్వేరుగా హాజరైనప్పటికీ ఇద్దరూ కలిసి పాడెమోశారు.