విడాకులు తీసుకున్న నిహారిక కొణిదెల-చైతన్య
- విడాకులు మంజూరు చేసిన కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు
- సోషల్ మీడియాలో దరఖాస్తుకు సంబంధించిన ఫొటో వైరల్
- విభేదాలు తలెత్తడంతో విడిపోనున్నారని కొన్నిరోజులుగా ప్రచారం
- ఇప్పుడు విడాకులు మంజూరు చేసిన ఫ్యామిలీ కోర్టు
ఇటీవల చైతన్య తన ఇన్స్టా పేజి నుండి నిహారికకు సంబంధించిన ఫొటోలను తొలగించారు. దీంతో వీరు విడిపోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొన్నిరోజులకు నిహారిక కూడా చైతన్య ఫొటోలను తొలగించింది. ఆ తర్వాత మెగా ఫ్యామిలీ ఈవెంట్లకు చైతన్య హాజరుకాలేదు.
ఇద్దరిమధ్య అభిప్రాయభేదాలు రావడంతో కొన్నిరోజులుగా వేర్వేరుగా ఉంటున్నారు. నిహారిక ఇటీవల తన ప్రొడక్షన్ వ్యవహారాలకు సంబంధించిన కార్యాలయాన్ని హైదరాబాద్ లో తెరిచింది. ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమాల ఫొటోలలో చైతన్య ఎక్కడా లేరు. నిహారిక 2020 డిసెంబర్ లో చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకున్నారు. రెండేళ్లకే విభేదాల కారణంగా ఇప్పుడు విడిపోయారు.