జగన్ ఒక్కొక్కరి తలపై రూ. 1.80 లక్షల అప్పు పెట్టారు: బీజేపీ నేత సత్యకుమార్
- జగన్ పాలనలో ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్న సత్యకుమార్
- వైసీపీ నేతల అరాచకాలు తార స్థాయికి చేరుకున్నాయని వ్యాఖ్య
- సొంత జిల్లాలో కూడా జగన్ రోడ్లు వేయలేకపోయారని విమర్శ
అనంతపురం జిల్లాలో దివ్యాంగులకు ఇచ్చిన 10 సెంట్ల స్థలాన్ని కూడా వైసీపీ నేతలు కబ్జా చేశారని... వారిని ప్రశ్నించిన దివ్యాంగులపై పోలీసులు కేసులు నమోదు చేయడం దారుణమని సత్యకుమార్ మండిపడ్డారు. గ్రామీణ ఉపాధి పథకం కింద ఒక్కో కూలీకి కేంద్ర ప్రభుత్వం రూ. 272 ఇస్తుంటే... అందులో కమిషన్ల పేరుతో వైసీపీ నేతలు దోచుకుని, కూలీలకు కేవలం రూ. 150 మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. సొంత జిల్లా కడపలో కూడా జగన్ రోడ్లను వేయలేకపోయారని దుయ్యబట్టారు.